Notification

తనికెళ్ల లక్ష కాలేజీ ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తనికెళ్ల లక్ష కాలేజీ ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలుసంబరాల్లో పాల్గొన్న IDZ ఉద్యోగులు, మహిళలు, యువత,ఖమ్మం జిల్లా, కొణిజర్ల: మండలంలోని తనికెళ్ల గ్రామ సమీపంలో ఉన్న లక్ష కాలేజీ ఆవరణలో IDZ ఉద్యోగుల ఆధ్వర్యం…

By · · Updated

Share this article

తనికెళ్ల లక్ష కాలేజీ ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సంబరాల్లో పాల్గొన్న IDZ ఉద్యోగులు, మహిళలు, యువత,ఖమ్మం జిల్లా, కొణిజర్ల: మండలంలోని తనికెళ్ల గ్రామ సమీపంలో ఉన్న లక్ష కాలేజీ ఆవరణలో IDZ ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కాలేజీ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ వేడుకల్లో కంచర్ల ప్రియాంక, తుప్పతి రవికుమార్, సిరిపురపు శేషగిరిరావు, మల్లారపు నరేష్–అనూష, కె. సాయి తేజ, మోటే కీర్తి, చిందల పావని, ఎస్.కె. బాతుషా, అలేఖ్య, యాస బాలకృష్ణ, మేకల నరేష్, తుప్పతి వంశీకృష్ణ, సిరిపురపు రోహిత్, మందారపు రవీందర్, ఎం. వంశీ, లత, బైరు త్రివేణి, గురిజాల త్రివేణి, దుంపల కిషోర్–వసంత రాణి, గుడిపూడి జ్యోతి, మునగపాటి శేఖర్, కోరుమల్లి, పి. సునీత, కృష్ణారావు–గోపమ్మ, పాండవుల కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: