తెలంగాణ

మగ్గం నేసే చేతులకు మరింత భరోసా.. చేనేత అభివృద్ధికి ఎమ్మెల్యే రేవూరి ప్రోత్సాహం!

పరకాల, తెలంగాణ గళం:అక్టోబర్ 30 పరకాల మండలంలోని నాగారం గ్రామంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కార్పొరేట్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించా…

By · · Updated

Share this article
మగ్గం నేసే చేతులకు మరింత భరోసా.. చేనేత అభివృద్ధికి ఎమ్మెల్యే రేవూరి ప్రోత్సాహం!

పరకాల, తెలంగాణ గళం:అక్టోబర్ 30

పరకాల మండలంలోని నాగారం గ్రామంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కార్పొరేట్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. చేనేత రంగానికి ఆధునిక సాంకేతికతను జోడించి, మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి హనుమకొండ హెచ్‌అండ్‌టీ ఏడీ ఎం. విజయలక్ష్మి, వరంగల్ హెచ్‌అండ్‌టీ ఏడీ, డీఎంవో బొట్టు వెంకటేశ్వర్లు, హనుమకొండ డబ్ల్యూడీసీసీ బ్యాంక్ ఏజీఎం కృష్ణమోహన్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కార్పొరేట్ తరహాలో నూతన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెట్‌లో మరింత ఆదరణ, డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. ఆధునిక డిజైన్లు, నాణ్యతతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందిస్తే చేనేత రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

ఇలాంటి కేంద్రాల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు దాసరి బిక్షపతి, ఉపాధ్యక్షుడు రఘుపతి, కార్యదర్శి వావిలాల రాజసమ్మయ్య, కోశాధికారి గాజర్ల రాజేందర్, కంబత్తుల సాంబయ్య, దాసరి రాజమణి, మంత్రి మహేశ్వరి, శ్యామల మహేందర్, మెండు రాజేందర్‌తో పాటు చేనేత సంఘం నాయకులు, సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Tags: