బీఆర్ఎస్లోకి క్యూ కట్టిన కీలక నేతలు!
గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్!
హనుమకొండ ,తెలంగాణ గళం (అక్టోబర్29):
పర్వతగిరి మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో మండలంలో పనిచేస్తున్న పలువురు కీలక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పర్వతగిరి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ ల సమక్షంలో భారీగా నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
చేరిన ప్రముఖుల జాబితా:
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ జూలపెల్లి గంగాధర్ రావు, ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి సింగారపు రమేష్, సీనియర్ నాయకులు జూల్లపెల్లి సురేందర్ రావు, జూల్లపెల్లి సోమేశ్వర్ రావు, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు కాంటెమ్ సుధాకర్, మైనార్టీ మండల నాయకురాలు షేక్ సుల్తాన, మాజీ నాయిని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి కనకయ్య, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్, మండల మాజీ మైనార్టీ అధ్యక్షుడు ఎండి గౌస్ పాషా, మాజీ యూత్ వైస్ ప్రెసిడెంట్ చింతకుంట్ల రంజిత్, మాజీ వార్డు సభ్యులు చిరుకొండ వీరస్వామి, ముదిదేన దేవేందర్, కొలుగూరి సంతోష్ రావు, వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, బొట్ల అనిల్ తదితరులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ గుటికి చేరారు.
రేవంత్ రెడ్డి అబద్ధాల పాలనపై ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజం:
చేరికల అనంతరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
- "మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర అరిగోస పడుతున్నారు."
- ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నీరుగార్చి రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాల మాటలతోనే పరిపాలిస్తున్నారని విమర్శించారు.
- తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను కేవలం 6 గంటలకే పరిమితం చేసిన రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
- తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధే శ్రీరామరక్ష అని, అందుకే నేడు మళ్లీ జనాలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు.
- పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, సముచిత స్థానం ఉంటుందని, అందరూ సమన్వయంతో, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, ఎం. మనోజ్ గౌడ్, ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి, బోయినపల్లి యుగంధర్ రావు, పుట్టపురం ఏకాంతం గౌడ్, రంగు కుమార్, చిన్నపాక శ్రీనివాస్, చీమల బిక్షపతి, మాడుగుల రాజు, ఏర్పుల శ్రీనివాస్, డెక్క సునీత కుమారస్వామి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







