హసన్పర్తి/తెలంగాణ గళం/అక్టోబర్ 28:
తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేడిపెల్లి మదన్ గౌడ్ నియమితులయ్యారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో గల బింగి ఎల్లయ్య యాదవ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ‘రేషన్ డీలర్ల గౌరవ వేతన సాధన సభ’ లో సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు నాయకోటి రాజు బుధవారం మదన్ గౌడ్ కు నియామక పత్రాన్ని అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు డీలర్లకు కూడా రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది:
రాష్ట్ర ఉపాధ్యక్షులు: గడ్డం నాగేశ్వర్ రావు గౌడ్
రాష్ట్ర కార్యదర్శి: వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి
రాష్ట్ర సహాయ కార్యదర్శులు: పోచు విమల, నద్దునూరి ఆనందం
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు: మర్త రవీందర్
ఈ సందర్భంగా మేడిపెల్లి మదన్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీలర్ల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసిన సేవలను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రేషన్ డీలర్ల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.






