తెలంగాణ

చర్లపల్లిలో కాంగ్రెస్‌కు జోష్‌.సర్పంచ్‌తో పాటు 20 మంది పార్టీలో చేరిక!

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బండి రేణుక, శంకర్‌ సర్పంచ్‌ సహా పలువురు పరకాల, తెలంగాణ గళం: అక్టోబర్ 29 పరకాల నియోజకవర్గంలోని చర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోకి చేర…

By · · Updated

Share this article
చర్లపల్లిలో కాంగ్రెస్‌కు జోష్‌.సర్పంచ్‌తో పాటు 20 మంది పార్టీలో చేరిక!

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బండి రేణుక, శంకర్‌ సర్పంచ్‌ సహా పలువురు

పరకాల, తెలంగాణ గళం: అక్టోబర్ 29

పరకాల నియోజకవర్గంలోని చర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన బండి రేణుక, శంకర్ సర్పంచ్‌తో పాటు దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా, ఎమ్మెల్యే వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చర్లపల్లి గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గ్రామంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని నాయకులు పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చర్లపల్లిలో జరిగిన ఈ చేరికలతో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.

Tags: