తెలంగాణ

వృథా కాదు మీ మరణం.మాసిపోదు మీ త్యాగం పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం

బస్టాండ్ సర్కిల్‌లో పోలీసు బ్యాండ్ ప్రదర్శనతో ప్రజల్లో అవగాహన పరకాల, తెలంగాణ గళం:అక్టోబర్ 29 పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో పోలీసు అమరవీరుల సం…

By · · Updated

Share this article
వృథా కాదు మీ మరణం.మాసిపోదు మీ త్యాగం  పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం

బస్టాండ్ సర్కిల్‌లో పోలీసు బ్యాండ్ ప్రదర్శనతో ప్రజల్లో అవగాహన

పరకాల, తెలంగాణ గళం:అక్టోబర్ 29

పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) సందర్భంగా పరకాల పట్టణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పరకాల బస్టాండ్ సర్కిల్, అంబేద్కర్ సెంటర్లలో పోలీసు బ్యాండ్ బృందం ఆకట్టుకునేలా వాయిద్య ప్రదర్శన నిర్వహించింది.

ప్రజల రక్షణే లక్ష్యంగా.. ప్రాణాలర్పించిన అమర వీరులు!

విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో, ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పోషిస్తున్న పాత్రను వివరించారు. 

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు వీరుల సేవలు సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని చాటిచెప్పారు.

బ్యాండ్ ప్రదర్శనతో ప్రజల్లో అవగాహన..

పోలీసు బ్యాండ్ బృందం ప్రదర్శించిన దేశభక్తి, క్రమశిక్షణను ప్రతిబింబించే వాయిద్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. 

ఈ సందర్భంగా “వృథా కాదు మీ మరణం.. మాసిపోదు మీ త్యాగం.. పోలీసు అమరవీరుల ఆశయాలను సాధిద్దాం” అనే నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలకు సహకరించాలని సందేశాన్ని అందించారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పోలీసుల త్యాగాలను గుర్తుచేయడంతో పాటు, ప్రజలకు పోలీసు శాఖపై మరింత అవగాహన కల్పించేలా సాగింది.

ఈ కార్యక్రమంలో పరకాల పోలీస్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై పవన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags: