సంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీ గాజుల హరిశంకర్ గారిని తెల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ శ్రీమతి మల్లేపల్లి లలితా సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ "సన్మాన సభ" అత్యంత వైభవంగా జరిగింది.
విద్యాబోధనలో విశేష కృషి చేస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న హరిశంకర్ గారి సేవలను ఈ సందర్భంగా లలితా సోమిరెడ్డి గారు కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యా కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
.





