తాజా వార్తలు

బీఆర్ఎస్‌పై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

 బీఆర్ఎస్‌పై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చనాఖా–కొరటా ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ **రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీసీలకే అవకాశం ఇచ్చి సామాజిక న్యాయాన్ని ఆచరిస్తున్నాం** ఆదిలాబాద్ జిల్…

By · · Updated

Share this article

 బీఆర్ఎస్‌పై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

చనాఖా–కొరటా ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ

**రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీసీలకే అవకాశం ఇచ్చి సామాజిక న్యాయాన్ని ఆచరిస్తున్నాం**

ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశీర్వాదం కోరుతూ, వారి దీవెనల కోసమే జిల్లాకు వచ్చామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదిలాబాద్‌లో ఇంద్రవెల్లి లొ నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జిల్లాలో ఒక్క ఎకరానికైనా సాగునీరు అందించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని గర్జన సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.

రైతులు పంటలు వేయవద్దని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలో కొనసాగడానికి అర్హులు కారని విమర్శించారు. చనాఖా–కొరటా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.368 కోట్ల నుంచి రూ.2,100 కోట్లకు పెంచి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పెరిగిన నిధులు ఎక్కడికి వెళ్లాయి? ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి చేరింది? బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిందా? అనే అంశాలపై ఆ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సామజిక న్యాయం గురించి మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చూపిస్తున్నామని కవిత పేర్కొన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీసీ అభ్యర్థులనే ప్రకటించడం ద్వారా రాజకీయాల్లో మార్పునకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Tags: