తాజా వార్తలు

తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి!

ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు By Lakavath Sudhir  కొత్తగూడెం, అక్టోబర్‌ 28 (తెలంగాణ గళం): అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు, ఈ…

By · · Updated

Share this article
తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి!

ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

By Lakavath Sudhir 

కొత్తగూడెం, అక్టోబర్‌ 28 (తెలంగాణ గళం): అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ మేరకు బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అంకిత్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి వాతావరణ పరిస్థితులపై ఆరా తీశారు. తుఫాన్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Tags: