హైదరాబాద్‌లోని నివాసంలో మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని రామచంద్రాపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గారికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పలు చిన్న చితక పనులకు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి తగిన నిధులు మంజూరైతే డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు
.





