Notification

గవర్నర్ కోట MLC డాక్టర్ లోకేష్ యాదవ్ కు ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏకగ్రీవ తీర్మానం

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గవర్నర్ కోట MLC డాక్టర్ లోకేష్ యాదవ్ కు ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏకగ్రీవ తీర్మానం గత 26 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుని NSUI నుండి రాష్ట…

By · · Updated

Share this article
గవర్నర్ కోట MLC డాక్టర్ లోకేష్ యాదవ్ కు ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏకగ్రీవ తీర్మానం

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గవర్నర్ కోట MLC డాక్టర్ లోకేష్ యాదవ్ కు ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏకగ్రీవ తీర్మానం గత 26 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుని NSUI నుండి రాష్ట్ర అధికార ప్రతినిధి వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడి, జైలు జీవితం అనుభవించిన ఉద్యమనేత, ఉన్నత విద్యా* *వంతుడు, సమర్థుడు డాక్టర్ లోకేష్ యాదవ్ కు గవర్నర్ కోట MLC ఇవ్వడం వలన ఉమ్మడి ఖమ్మం జిల్లా BCలకు కొంత వరకైనా న్యాయం జరుగుతుంది. 60 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోతే మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి?2014, 2018, 2023 సంవత్సరాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో MLA,MP, MLC, రాజ్యసభ, మంత్రి ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించలేదుBC ల జనాభా ఎక్కువ........ చట్టసభల్లో BC ల ప్రాతినిధ్యం తక్కువ ఓట్లు మావి ... సీట్లు మీకా.... ప్రజా ప్రభుత్వం అంటే జిల్లాలో బీసీలకు ప్రాతినిధ్యమే లేకుండా చేయడమా.ఇదెక్కడి న్యాయం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాతియుగంలో ఉన్నదా? జనాభా దామాషా ప్రకారం మీరెంతో... మీకంత వాటా అనే రాహుల్ గాంధీ గారి నినాదం ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ కు వర్తించదా.కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా BC లకు న్యాయం చేయాలి.బీసీ సంఘాల హెచ్చరిక..... ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు  పొదిల సతీష్ యాదవ్, డిమాండ్.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల వీరబాబు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యలమందుల జగదీష్, యాదవ సంఘం జిల్లా నాయకులు సత్తి వెంకన్న యాదవ్, ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగడాల అనంత రాములు ముదిరాజ్, ముదిగొండ బీసీ సంఘం అధ్యక్షులు రామకోటి యాదవ్, విద్యార్థి సంఘం నాయకులు వినయ్, వంశీ, నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags: