Notification

ఇంటి వివాదం పై తుమ్మలపల్లి సర్పంచ్ దాడి

ఖమ్మం జిల్లా కొణిజర్ల లో ఇంటి స్థలం వివాదం విషయంపై పందిళ్ళ స్వాతి ఇంటిపై తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ డేరంగుల వెంకటరమణ, బ్రహ్మం, అనుచర వర్గం మూకమ్మడిగా దాడికి పాల్పడ్డారు కొనిజర్ల గ్రామపంచాయతీ లోని రామా…

By · · Updated

Share this article
ఇంటి వివాదం పై తుమ్మలపల్లి సర్పంచ్ దాడి

ఖమ్మం జిల్లా కొణిజర్ల లో ఇంటి స్థలం వివాదం విషయంపై పందిళ్ళ స్వాతి ఇంటిపై తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ డేరంగుల వెంకటరమణ, బ్రహ్మం, అనుచర వర్గం మూకమ్మడిగా దాడికి పాల్పడ్డారు కొనిజర్ల గ్రామపంచాయతీ లోని రామాలయం సమీపంలో పందిళ్ళ స్వాతి అనే మహిళ కుటుంబంతో నివసిస్తుంది స్వాతి నివసించే నివాసం తమదేనంటూ తుమ్మలపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ డేరంగుల వెంకటరమణ తో కలిసి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇల్లు ఖాళీ చేయాలని స్వాతిని బెదిరించారు జెసిబి తో ఇంటిని కూల్చివేస్తామని సర్పంచ్ అనుచరులు దాడికి పాల్పడ్డారు ఇంట్లో ఉన్న సామాన్లను బయటకు పడేసి స్వాతి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు ఇంట్లో ఉన్న 13 లక్షల రూపాయల విలువైన ఐదు తులాల బంగారం 16 తులాల వెండి మూడు లక్షల రూపాయలు నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది తమ ఇంటిపై దాడికి పాల్పడ్డ తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ వెంకటరమణ, బ్రహ్మం తో పాటు సర్పంచ్ అనుచరులపై కేసు నమోదు చేయాలని కొనిజర్ల పోలీస్ స్టేషన్ లో బాధితురాలు పందిళ్ల స్వాతి ఫిర్యాదు చేసింది తన నివసించే ఇల్లు డాక్యుమెంట్లు తమకే ఉన్నాయని అక్రమంగా తమ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది

Tags: