పటాన్‌చెరు నియోజకవర్గం, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వార్డులో బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను, బహుజన మిత్రులను కలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా వివిధ పరిచయాల ద్వారా బహుజన సమాజంలో ఐక్యతను పెంపొందిస్తూ ఈరోజు జన్ కళ్యాణ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తోటి బహుజన మిత్రులు అందించిన సహకారం, చూపిన ఆదరణ ఎంతో అభినందనీయమని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
బహుజనుల ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ ప్రజల మధ్య ఉంటూ బహుజనుల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు
.





