తాజా వార్తలు

ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి

ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి   మెట్‌పల్లి, అక్టోబర్ 31,తెలంగాణ గళం:     మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మెట్‌పల్లి పట్టణంలోని కాంగ్రె…

By · · Updated

Share this article
ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి

ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి

 

మెట్‌పల్లి, అక్టోబర్ 31,తెలంగాణ గళం:

 

  మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మెట్‌పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసరు. ఆమె దేశానికి అందించిన సేవలను, ప్రధానిగా దేశాభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారత రాజకీయాల్లో ఇందిరాగాంధీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశ నాయకత్వ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని గుర్తుచేశారు. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ఆమె నాయకత్వం దోహదపడిందని తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో ఇందిరాగాంధీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బూరం రాజేష్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బార్ల సూరి, కౌన్సిలర్లు రెబ్బస్ మహేష్, మసూలా ప్రవీణ్, బత్తుల నరేష్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు పన్నాల మాధవ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags: