మెదక్ జిల్లా శివ్వంపేట, తెలంగాణ గళం):పంట చేతికి రావడంతో రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రహదారులనే వేదికగా చేసుకుంటున్నారు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న గొట్టిముక్కుల నుంచి మనోహరాబాద్‌కు వెళ్లే రహదారితో పాటు చండి నుంచి గోమారం వెళ్లే ప్రధాన మార్గంలో పలుచోట్ల వరి ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.పంట కోతలు పూర్తయిన అనంతరం ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు సరైన స్థలం లేక కొంతమంది రైతులు రహదారులపై ధాన్యాన్ని పరుస్తున్నారు. అయితే రహదారులపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇవ్వడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ధాన్యం పరచిన ప్రాంతాలను దాటే సమయంలో అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టే క్రమంలో రహదారిలో ఎక్కువ భాగం ఆక్రమించడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఇబ్బందులు పడుతున్నాయి.ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. చీకట్లో రహదారిపై ఉన్న ధాన్యం కుప్పలు, ధాన్యం ఆరబెట్టిన ప్రాంతాలు వాహనదారులకు సరిగ్గా కనిపించడం లేదు. దీంతో వేగంగా వచ్చే వాహనదారులు ఒక్కసారిగా ధాన్యం కుప్పలను గుర్తించలేక వాటిని ఢీకొనే ప్రమాదం ఉంది. ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడే అవకాశాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.రైతులు పండించిన పంటను కాపాడుకోవడం, ధాన్యాన్ని సురక్షితంగా ఆరబెట్టుకోవడం ఎంత ముఖ్యమో, రహదారులపై ప్రయాణించే ప్రజల భద్రత కూడా అంతే ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతులు రహదారులపై కాకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.సంబంధిత అధికారులు స్పందించి రహదారులపై ధాన్యం ఆరబెట్టకుండా అవగాహన కల్పించాలని, వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, ప్రజల రాకపోకలకు ఆటంకం లేకుండా అధికారులు సమన్వయంతో పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రోడ్లపైనే వరి ధాన్యం ఆరబోత.. వాహనదారులకు తప్పని తిప్పలు
మెదక్ జిల్లా శివ్వంపేట, తెలంగాణ గళం):పంట చేతికి రావడంతో రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రహదారులనే వేదికగా చేసుకుంటున్నారు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంట…
By తెలంగాణ గళం · · Updated
Share this article




