పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్‌చెరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్' ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారితో కలిసి రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ, స్థానిక ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన, నాణ్యమైన అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు
.





