తెల్లాపూర్ డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా భూగర్భ జలాలను తోడేస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
భూగర్భ జలాలు అడుగంటిపోయి సామాన్య ప్రజలు, స్థానికులు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుంటే.. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ట్యాంకర్లతో అక్రమంగా నీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే ట్యాంకర్లను సీజ్ చేసి, అక్రమ నీటి రవాణాకు అడ్డుకట్ట వేయాలని రెవెన్యూ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు సీపీ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, తేన గ్రూప్ రమణ గారితో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





