తెలంగాణ

విద్యార్థులకు మాక్ పార్లమెంట్ నిర్వహణ

హైదరాబాద్: విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పిఎంశ్రీ పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల…

By · · Updated

Share this article
విద్యార్థులకు మాక్ పార్లమెంట్ నిర్వహణ

హైదరాబాద్:

విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పిఎంశ్రీ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు హైదరాబాదులోని ఎస్సిఈఆర్టి భవన్ లో శనివారం రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా, ప్రతిపక్ష నాయకులుగా వివిధ పాత్రలను పోషించారు. ఈమాక్ పార్లమెంటు సమావేశంలో సభా కార్యక్రమాలను అనుకరిస్తూ ముఖ్యంగా వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం వాటి వల్ల కలిగే సమస్యలు, పరిష్కారం, ఇంధన వనరుల సమర్థవంత వినియోగం, విద్యార్థులపై డిజిటల్ వినియోగం వల్ల  ప్రభావం - పరిష్కారం, ఆహార భద్రత, పలు అంశాలపై విద్యార్థులు ఈ కార్యక్రమంలో చర్చించారు. ప్రజా సమస్యలు, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉత్పత్తి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. విద్యార్థులు తమ తమ శాఖల తరఫున ప్రసంగిస్తూ సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించారు. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య చర్చలు, ప్రశ్నోత్తరాలు, సూచనలతో సభ ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ ప్రాముఖ్యతను, ప్రజా సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మాక్ పార్లమెంట్ నిర్వహణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందుతాయని  తెలిపారు. 

Tags: