తెలంగాణ

పరకాలలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు.చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

దేశ సమైక్యతకు ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం! పరకాల, తెలంగాణ గళం:అక్టోబర్ 31  భారతదేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం విశేష కృషి చేసి దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మాజీ ప్రధానమంత్రి, దివంగత…

By · · Updated

Share this article
పరకాలలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు.చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

దేశ సమైక్యతకు ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం!

పరకాల, తెలంగాణ గళం:అక్టోబర్ 31 

భారతదేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం విశేష కృషి చేసి దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని పరకాల పట్టణ కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పరకాల కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పరకాల పట్టణ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ చిత్రపటానికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నాయకులు ఆమె దేశానికి అందించిన సేవలను, ధైర్యసాహసాలను, దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని స్మరించుకున్నారు.

దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ఇందిరాగాంధీ చేసిన కృషి, దేశ అభివృద్ధి కోసం ఆమె తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. 

పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె చేపట్టిన కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు. దేశం కోసం ఆమె చేసిన త్యాగాలు, అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

Tags: