తాజా వార్తలు

చాకరిమెట్ల ఆంజనేయ స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

మెదక్ జిల్లా శివ్వంపేట, అక్టోబర్ 31 (తెలంగాణ గళం):శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కల గ్రామ పరిధిలోని ప్రసిద్ధ చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గాదే ప్రవీణ్ కుమార…

By · · Updated

Share this article
చాకరిమెట్ల ఆంజనేయ స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

మెదక్ జిల్లా శివ్వంపేట, అక్టోబర్ 31 (తెలంగాణ గళం):శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కల గ్రామ పరిధిలోని ప్రసిద్ధ చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గాదే ప్రవీణ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో హారతి సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు.అనంతరం ఆలయ ప్రాంగణంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి వివరించినట్లు తెలిసింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, జిల్లా న్యాయమూర్తి సుచరిత, ఆర్డీవో రామకృష్ణ, డీఎస్పీ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయమూర్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

Tags: