తెలంగాణ

​తెల్లాపూర్‌లో అక్రమ నీటి మాఫియాపై కొరడా: 3 వాటర్ ట్యాంకర్లు సీజ్.. అధికారులకు ప్రజా వినతి

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ శివారు ప్రాంతంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ నీటి వ్యాపారంపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భూగర్భ జలాలను కొల్లగొడుతూ పెద్ద ఎత్తున దందా నిర్వహిస…

By · · Updated

Share this article
​తెల్లాపూర్‌లో అక్రమ నీటి మాఫియాపై కొరడా: 3 వాటర్ ట్యాంకర్లు సీజ్.. అధికారులకు ప్రజా వినతి

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ శివారు ప్రాంతంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ నీటి వ్యాపారంపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భూగర్భ జలాలను కొల్లగొడుతూ పెద్ద ఎత్తున దందా నిర్వహిస్తున్న నీటి మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 28న రామచంద్రపురం డిప్యూటీ ఎమ్మార్వోతో పాటు 'హైడ్రా' (HYDRAA) కమిషనర్ గారికి అధికారికంగా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది.

​ఈ ఫిర్యాదులపై స్పందించిన రామచంద్రపురం రెవెన్యూ అధికారులు, నేడు (31-10-2026) క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్న మూడు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేశారు. అధికారుల తక్షణ చర్యలను స్వాగతిస్తూనే.. సమస్య మూలాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

​కేవలం ట్యాంకర్లను సీల్ చేస్తే సరిపోదని, తెల్లాపూర్ శివార్లలో ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన అక్రమ బోర్లు, పెద్ద ఎత్తున తవ్విన గుంతలు (ప్లాస్టిక్ షీట్లు వేసి నీటిని నిల్వ చేస్తున్న భారీ సంపులు), అమర్చిన విద్యుత్ మోటార్లను పూర్తిగా తొలగించి గుంతలను పూడ్చివేయాలని కోరుతున్నారు. ప్రజల తాగునీటి అవసరాలకు గండికొడుతూ వేల కోట్ల వ్యాపారం చేస్తున్న అక్రమ నీటి మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రామచంద్రపురం రెవెన్యూ అధికారులకు, హైడ్రా యంత్రాంగానికి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.