తెలంగాణ

వైద్యం వ్యాపారం కాదు.. మానవత్వంతో కూడిన సేవ: ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు పట్టణంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన 'ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్' ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారితో పాటు…

By · · Updated

Share this article
వైద్యం వ్యాపారం కాదు.. మానవత్వంతో కూడిన సేవ: ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు పట్టణంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన 'ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్' ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారితో పాటు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాద్రి దేవేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ.. ఆసుపత్రి అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదని, ఆపదలో ఉన్న ప్రాణాలకు అండగా నిలిచే సేవా మందిరమని పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పటాన్‌చెరు ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రావడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ మానవతా దృక్పథంతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.