తెలంగాణ

యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

పరకాలలో బీజేవైఎం నిరసన ర్యాలీ పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం పరకాల పట్టణ అధ్యక్షుడు…

By · · Updated

Share this article
యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

పరకాలలో బీజేవైఎం నిరసన ర్యాలీ

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 17 :

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం పరకాల పట్టణ అధ్యక్షుడు దాసరి ప్రణీత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. 

పరకాలలోని బీజేపీ కార్యాలయం నుంచి బస్టాండ్‌లోని అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, రాజీవ్ యువ వికాసం పథకం, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేసి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. యువత భవిష్యత్తు కోసం బీజేవైఎం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ గాలిఫ్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొలనుపాక రేవన్ సిద్ధు, క్రాంతి కుమార్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కక్కు రాజు, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ, మాచవేణి అశోక్, చెక్క సతీష్, సాంబారి విఘ్నేష్ పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సంతోష్ కుమార్, పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్, కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్, మండల అధ్యక్షుడు రాజకుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, దామెర బీజేపీ ప్రధాన కార్యదర్శి ముకేశ్, బీజేవైఎం మండల అధ్యక్షులు రేగూరి శశిధర్ రెడ్డి, తాళ్లపల్లి హరికృష్ణ, శివ, రాచర్ల నరేష్, పోతరాజు శ్రీకాంత్, పసరుగొండ ఉపసర్పంచ్ మంద మనోజ్‌తో పాటు పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: