తెలంగాణ

యక్షగాన కళాకారుడు అక్బర్ కు జాతీయ అవార్డు

*రామాయణ యక్షగాన ప్రదర్శనలకు జాతీయ గుర్తింపు*  సుద్దాల జానకమ్మ–హనుమంతు జాతీయ పురస్కారం 2026కు పోచారం కళాకారుడు అక్బర్ పాషా ఎంపిక పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 17: పరకాల మండలం పోచారం గ్రామానికి చెంది…

By · · Updated

Share this article
యక్షగాన కళాకారుడు అక్బర్ కు జాతీయ అవార్డు

*రామాయణ యక్షగాన ప్రదర్శనలకు జాతీయ గుర్తింపు* 

సుద్దాల జానకమ్మ–హనుమంతు జాతీయ పురస్కారం 2026కు పోచారం కళాకారుడు అక్బర్ పాషా ఎంపిక

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 17:

పరకాల మండలం పోచారం గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు మహమ్మద్ అక్బర్ పాషా ప్రతిష్ఠాత్మక సుద్దాల జానకమ్మ–హనుమంతు జాతీయ పురస్కారం–2026కు ఎంపికయ్యారు. 

రామాయణ ఇతివృత్తంతో యక్షగాన ప్రదర్శనలు చేస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు.

ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో అక్బర్ పాషాకు జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన కళాకారుడు జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

Tags: