తెలంగాణ గళం, సెప్టెంబర్ 8
పరకాల: వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే వినాయక నిమజ్జన ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు.
పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్, మున్సిపల్ కమిషనర్ పోతురాజు పవన్ కలిసి మంగళవారం నిమజ్జనం కోసం ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని పరిశీలించారు. నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, లైటింగ్, బారికేడ్లు, క్రేన్ సౌకర్యం, శుద్ధి పనులపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా చైర్మన్ సునీల్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ పరిశీలనలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






