ప్రజల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం
పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 22
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసుల విధుల్లో కీలకమైన ఆయుధాలతో పాటు పోలీస్ వాహనాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. దుష్టశక్తులపై దైవశక్తులు విజయం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటారని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు పండుగను సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.






