పరకాల పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య-శ్రీధర్
పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 20:
పరకాల పట్టణ ప్రజలకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య-శ్రీధర్ దంపతులు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా అని, అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయాలకు గుర్తుగా జరుపుకునే పండుగే విజయదశమి అని వారు పేర్కొన్నారు. ఈ రోజు రావణాసురుడిని రాముడు, మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి ధర్మాన్ని రక్షించారని పురాణాలు చెబుతున్నాయన్నారు.
చెడు ఎంత బలమైనదైనా అంతిమంగా గెలిచేది మంచేనని ఈ పండుగ చాటి చెబుతుందని, ఈ దసరా అందరి జీవితాల్లోని అడ్డంకులు, చింతలు తొలగించి కుటుంబాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.






