తెలంగాణ

​విజయదశమి పర్వదినాన శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ

మంచిర్యాల పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు పవిత్ర విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల…

By · · Updated

Share this article
​విజయదశమి పర్వదినాన శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ

మంచిర్యాల పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు పవిత్ర విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు కుటుంబ సమేతంగా హాజరై, శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ.. "ఆధ్యాత్మికత మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. మన ఆలయాలు కేవలం భక్తికి నిలయాలు మాత్రమే కాకుండా, మన ఘనమైన వారసత్వానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి" అని అన్నారు. సుమారు రూ. 4 కోట్ల 94 లక్షల నిధులతో విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించి, భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాలకు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ ఆలయాల అభివృద్ధికి తమ వంతు ప్రాధాన్యతనిస్తామని ఆయన పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారు, ఎమ్మెల్యే తనయుడు శ్రీ కొక్కిరాల చరణ్ రావు గారు, ఆలయ ఈఓ ముక్త రవి గారు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, ఆలయ అర్చకులు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు పూదరి తిరుపతి, ఇతర కార్పొరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు

Tags: