విద్యుత్ సరఫరా పరిస్థితులు, నిర్వహణ తీరుపై ఆరా.. లాగ్‌బుక్‌ను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే
పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 16:
పరకాల పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా పరిస్థితులు, నిర్వహణ తీరును పరిశీలించి, విద్యుత్ సరఫరాకు సంబంధించిన లాగ్‌బుక్‌ను తనిఖీ చేశారు.
అనంతరం విద్యుత్ సరఫరా ఎలా కొనసాగుతోంది, స్థానికంగా విద్యుత్ సరఫరా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలపై అక్కడి విద్యుత్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సబ్‌స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలిస్తూ విద్యుత్ సరఫరా, నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంట బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.






