తెలంగాణ

వర్ధన్నపేట నియోజకవర్గంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

హసన్‌పర్తి: (తెలంగాణ గళం )సెప్టెంబర్ 9: వర్ధన్నపేట శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు హనుమకొంది జిల్లా ప్రధానకార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, నియోజకవర్గ పరిధిలోని 65వ…

By · · Updated

Share this article
వర్ధన్నపేట నియోజకవర్గంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

హసన్‌పర్తి: (తెలంగాణ గళం )సెప్టెంబర్ 9:

వర్ధన్నపేట శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు హనుమకొంది జిల్లా ప్రధానకార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, నియోజకవర్గ పరిధిలోని 65వ డివిజన్‌ చింతగట్టు గ్రామంలో ,ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క అర్హుడికి అందాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.

ఈ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల అధికారి, జిపిఓ భారతి, ప్రముఖ నాయకులు జనగాని శ్రీనివాస్, దామెర రాజేందర్, నదునూరి యువరాజు, మరియు జనగాని రాజ్యలక్ష్మి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు మరియు నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు గారి దిశానిర్దేశంలో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్మార్ట్ రేషన్ కార్డులను పారదర్శకంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.