తెలంగాణ

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల్లో జాప్యంపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం

తెలంగాణ గళం/ హనుమకొండ (సెప్టెంబర్ 22): వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణానికి ఎలా…

By · · Updated

Share this article
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల్లో జాప్యంపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం

తెలంగాణ గళం/ హనుమకొండ (సెప్టెంబర్ 22):

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ పరంగా గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, పనుల్లో పురోగతి మందకోడిగా ఉండటంపై అధికారులను నిలదీశారు.  

హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ పెవిలియన్‌లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాధాన్యత కలిగిన ప్రధాన ఆసుపత్రుల నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయడానికి సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు: ​

రాబోయే 30 రోజుల పాటు రోజుకు 24 గంటల చొప్పున (మూడు షిఫ్టుల్లో) నిర్మాణ పనులను నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. ​పనుల పూర్తికి నిర్దిష్టమైన టైమ్‌లైన్‌తో కూడిన ప్రత్యేక వర్క్ షెడ్యూల్ తయారు చేసి, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ​ప్రతి పనికీ ఒక్కో ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలని, సీఎంవో అధికారులు సైతం తరచూ క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని వరంగల్ జిల్లా కలెక్టర్ ఇకపై ప్రతిరోజూ నేరుగా పర్యవేక్షించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సివిల్ పనులు, విద్యుత్, నీటి సరఫరా, వైద్య పరికరాల ఏర్పాటు వంటి భిన్న విభాగాల మధ్య ఎలాంటి ఆటంకాలు రాకుండా అధికారులతో వెంటనే ఒక 'సమన్వయ కమిటీ' ని ఏర్పాటు చేయాలని చెప్పారు. ​ఆహ్లాదకరమైన వాతావరణం: ఆసుపత్రి ప్రాంగణం, పరిసరాలను రోగులకు, వారి సహాయకులకు మానసిక ప్రశాంతత అందించేలా ఆహ్లాదకరంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలని సూచించారు. ​సనత్‌నగర్ టిమ్స్ తరహాలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ వీలైనంత త్వరగా ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.  

 

హసన్ పర్తి మండల రిపోర్టర్ :మోడెం సందీప్