తెలంగాణ

వరంగల్ శివనగర్‌లో తప్పిన పెద్ద ప్రమాదం!

తెలంగాణ గళం / వరంగల్ :(సెప్టెంబర్ 22) ఖమ్మం మార్గం నుండి వరంగల్ వైపు వస్తున్న ఒక కట్టెల లారీ శివనగర్ లోని ఎస్బీఐ (SBI) బ్యాంక్ మలుపు వద్ద ప్రమాదానికి గురైంది. అనియంత్రిత వేగంతో వచ్చిన లారీ రోడ్డు పక…

By · · Updated

Share this article
వరంగల్ శివనగర్‌లో తప్పిన పెద్ద ప్రమాదం!

తెలంగాణ గళం / వరంగల్ :(సెప్టెంబర్ 22)

ఖమ్మం మార్గం నుండి వరంగల్ వైపు వస్తున్న ఒక కట్టెల లారీ శివనగర్ లోని ఎస్బీఐ (SBI) బ్యాంక్ మలుపు వద్ద ప్రమాదానికి గురైంది. అనియంత్రిత వేగంతో వచ్చిన లారీ రోడ్డు పక్కన ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన అర్ధరాత్రి వేళ జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, లారీ ఎప్పుడు, ఏ సమయంలో వచ్చి దుకాణాలను ఢీకొట్టిందో ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.