హనుమకొండ, తెలంగాణ గళం సెప్టెంబర్ 9:
రాంనగర్ లోని శ్రీ భువనేశ్వరి మాత ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి పది వేల గాజులతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలతో నయనమనోహరంగా అలంకరించారు.శ్రావణ మాస మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపారు. గాజుల అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు భక్తులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో దేవాలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో, కోలాహలంగా మారింది. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.






