తెలంగాణ

​ట్రస్మా ఆధ్వర్యంలో ‘ఆచార్య దేవోభవ’ అవార్డుల ప్రదానోత్సవం.. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో విశిష్టమైనదని, విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అందించే గురువులను గౌరవించడం మనందరి బాధ్యత అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావ…

By · · Updated

Share this article
​ట్రస్మా ఆధ్వర్యంలో ‘ఆచార్య దేవోభవ’ అవార్డుల ప్రదానోత్సవం.. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో విశిష్టమైనదని, విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అందించే గురువులను గౌరవించడం మనందరి బాధ్యత అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పరిధిలోని గద్దెరగాడి ‘వి’ స్క్వేర్ (V Square) ఫంక్షన్ హాల్లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆచార్య దేవోభవ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం ఉపాధ్యాయులు సైతం ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును శాలువాతో ఘనంగా సన్మానించారు.

​ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, జిల్లా అధ్యక్షుడు రాపోల్ విష్ణువర్ధన్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్ పాల్గొన్నారు. వీరితో పాటు ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదారి చంద్రమోహన్, పట్టణ అధ్యక్షుడు దుర్గ ప్రసాద్, సీనియర్ కరస్పాండెంట్లు బాలాజీ, శరత్ కుమార్, శ్రీధర్, స్థానిక కార్పొరేటర్ గంగవరపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Tags: