తాజా వార్తలు

తెల్లాపూర్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు.. మధుప్రియ పాటలతో హోరెత్తిన వేడుకలు

తెల్లాపూర్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ గాయని మధుప్ర…

By · · Updated

Share this article
తెల్లాపూర్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు.. మధుప్రియ పాటలతో హోరెత్తిన వేడుకలు

తెల్లాపూర్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ గాయని మధుప్రియ, మద్దెల సందీప్ మరియు వారి బృందం పాల్గొని తమ పాటలు, సంగీతంతో సందడి చేశారు.

రంగురంగుల బతుకమ్మలు, మహిళల ఆటపాటలు, సంప్రదాయ గీతాలతో తెల్లాపూర్ పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపాయి.

మన సంస్కృతి మన గర్వం.. మన సంప్రదాయం మన గుర్తింపు.. బతుకమ్మ మన తెలంగాణ ఆత్మగౌరవం!