తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో దుర్గామాత నిమజ్జన మహోత్సవాన్ని స్థానిక భక్తులు, కాలనీవాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గాభవాని దివ్య ఆశీస్సులతో కాలనీవాసులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సమాజంలో సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, భక్తులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
.





