ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు.
ముఖ్యంగా జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.హైదరాబాద్ వాసులకు హెచ్చరిక:రాజధాని హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లే వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హాసన్ పర్తి : తెలంగాణ గళం
రిపోర్టర్ పేరు : మోడెమ్ సందీప్





