హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గురువారం నిర్వహించిన 174వ పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడిన పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు తెలియజేయాలని, ఆయన స్ఫూర్తిని యువతలో పెంపొందించాలని సీఎం పేర్కొన్నారు.
పండుగ సాయన్నను తెలంగాణ రాబిన్‌హుడ్‌గా అభివర్ణిస్తూ, ప్రజా పోరాట యోధుల చరిత్రకు అధికారిక గుర్తింపు కల్పించడం అభినందనీయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చడం, ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు
.





