దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 3, 2026
కొత్తగూడెం అక్టోబర్ 22 (తెలంగాణ గళం బ్యూరో):
By Lakavath Sudhir
సింగరేణి సంస్థలో 11 లా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 22, 2026న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను సంస్థలో ఇప్పటికే పనిచేస్తున్న అర్హులైన అంతర్గత అభ్యర్థుల (ఇంటర్నల్) ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన ఉద్యోగులు నవంబర్ 3, 2026లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని వివరాలను పరిశీలించి, నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రకటనలో తెలిపారు.






