తెలంగాణ

నూతన సీఐ ప్రవీణ్ కుమార్ కు బీజేపీ నేతలు ఘన స్వాగతం

తెలంగాణ గళం ,పరకాల, సెప్టెంబర్ 10: పరకాల పోలీస్ స్టేషన్ లో నూతనంగా సీఐగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతించారు. పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్…

By · · Updated

Share this article
నూతన సీఐ ప్రవీణ్ కుమార్ కు బీజేపీ నేతలు ఘన స్వాగతం

తెలంగాణ గళం ,పరకాల, సెప్టెంబర్ 10:

పరకాల పోలీస్ స్టేషన్ లో నూతనంగా సీఐగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతించారు.

పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఐ ప్రవీణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డా. సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పరకాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీసు శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో నూతన సీఐ కీలక పాత్ర పోషించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు కుక్కల విజయ్ కుమార్, ఆకుల లావణ్య శ్రీధర్, జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, కిసాన్ మోర్చా రాష్ట్ర లీగల్ సెల్ నాయకురాలు వేముల సదారాణి ఆంజనేయులు, ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి ఉడుత చిరంజీవి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి కృష్ణ ప్రసాద్, బాసాని సోమరాజు, సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: