తెలంగాణ

సన్న వడ్ల రైతులకు నేడే ఆఖరి అవకాశం

రూ.500 బోనస్‌ కోసం పంట వివరాల నమోదు తప్పనిసరి ఇల్లందు, సెప్టెంబర్‌ 10 (తెలంగాణ గళం): సన్న రకం వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 అదనపు బోనస్‌ పొందేందుకు పంట వివరాల నమోదుక…

By · · Updated

Share this article
సన్న వడ్ల రైతులకు నేడే ఆఖరి అవకాశం

రూ.500 బోనస్‌ కోసం పంట వివరాల నమోదు తప్పనిసరి

ఇల్లందు, సెప్టెంబర్‌ 10 (తెలంగాణ గళం): సన్న రకం వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 అదనపు బోనస్‌ పొందేందుకు పంట వివరాల నమోదుకు నేడే చివరి గడువు. గడువు ముగిసిన అనంతరం వివరాల నమోదుకు అవకాశం ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

రైతులు ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌, విత్తనాల కొనుగోలు రసీదులతో ‘టీ-ఆగ్రిసీడ్స్‌’ పోర్టల్‌లో లేదా సంబంధిత విత్తన డీలర్‌ వద్ద పంట వివరాలను నమోదు చేసుకోవాలి. సొంత విత్తనాలతో సాగు చేసిన రైతులు సమీప వ్యవసాయ విస్తరణాధికారి (AEO)కి స్వీయ ప్రకటన సమర్పించాలి.

బోనస్‌కు అర్హమైన ఏడు రకాలు: BPT-5204 (సాంబమసూరి), RNR-15048 (తెలంగాణ సోనా), KNM-1638, HMT సోనా, జై శ్రీరామ్‌, WGL-44, KNM-7715. ఈ ఏడు రకాల సన్న వడ్లను సాగు చేసిన రైతులకు మాత్రమే క్వింటాలుకు రూ.500 బోనస్‌ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అర్హులైన రైతులు చివరి గడువు కోల్పోకుండా వెంటనే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Tags: