తెలంగాణ

విద్యుత్ విస్తీకరణ పూర్తి

పరకాల ,తెలంగాణ గళం, సెప్టెంబర్ 10  రూ.20 వేల నగదు కూడా ఎత్తుకెళ్లిన దుండగులు.. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన పరకాల పట్టణంలో దొంగలు హల్‌చల్‌ చేశారు.హనుమకొండ రోడ్డు పరిధిలోని ఓ కిరాణా షాపులో గుర్తుతెలి…

By · · Updated

Share this article

పరకాల ,తెలంగాణ గళం, సెప్టెంబర్ 10

 రూ.20 వేల నగదు కూడా ఎత్తుకెళ్లిన దుండగులు.. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన

పరకాల పట్టణంలో దొంగలు హల్‌చల్‌ చేశారు.హనుమకొండ రోడ్డు పరిధిలోని ఓ కిరాణా షాపులో గుర్తుతెలియని దుండగులు కిటికీ పగులగొట్టి చొరబడి భారీగా బంగారం, నగదు అపహరించారు. ఈ ఘటన స్థానిక వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది.

 

పోలీసుల వివరాల ప్రకారం.. షాపు యజమాని ముక్క ప్రకాశం, చంద్రకళ దంపతులు ఓ ఫంక్షన్‌కు వెళ్లిన సమయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఇంటి వెనుక భాగంలోని కిటికీని పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న సుమారు 10 తులాల బంగారం, 5 తులాల పట్టగొలుసులతో పాటు క్యాష్ కౌంటర్‌లోని రూ.20 వేల నగదును అపహరించి పరారయ్యారు.

యజమాని చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలను సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి ప్రాంతంలోనే చోరీ జరగడంతో వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags: