- సమ్మక్క పస్తులుండి అయిన ఇతరుల ఆకలి తీర్చేది
- దశదిన కర్మ సందర్భంగా 100 మందికి ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది
కమలాపూర్ :-
కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామానికి చెందిన మాసు సమ్మక్క మృతి మమ్మల్ని తీవ్రంగా కలచివేసిందని పూర్వ విద్యార్థి నాయకుడు ఒస్కుల పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం సమ్మక్క దశదిన కర్మ కార్యక్రమం సందర్భంగా జమ్మికుంట, హుజురాబాద్,వరంగల్ ఎంజీఎం లో దాదాపు 100 మంది ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం తో వారి కడుపునింపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి పిల్లలని ప్రయోజకులను చేయాలని ఉన్నత విద్యను అందిస్తూనే గ్రామంలో ఉన్న ఎంతో మంది ఆకలితో ఉన్న వారి కడుపునింపేదని అన్నారు. ఇంట్లో కుటుంబం తో సహా సమ్మక్క పస్తులుండి ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టేదని తెలిపారు. కొడుకుని ఉపాధ్యాయుడుగా తీర్చితిద్ది ఈ రోజు వేలాది మంది విద్యార్థులకు పరోక్షంగా కొడుకు ద్వారా విద్యను అందించిన గొప్ప తల్లి సమ్మక్క అని కొనియాడారు. ఈ రోజు ఆ తల్లి మా మధ్య లేకపోవడం బాధాకరమని,ఆ తల్లి ఆలోచన మేరకే ఈ ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది అని తెలిపారు.






