లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల నాయకుడు, గత సర్పంచ్ ఎన్నికల్లో 500 ఓట్లు సాధించిన సంగ లచ్చన్న ఈరోజు తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షులు అంకతి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఇండ్ల లింగన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో లచ్చన్న పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం సంగ లచ్చన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు






