తెలంగాణ

సద్దుల బతుకమ్మ వేడుకలకు ముస్తాబవుతున్న పరకాల అంగడి మైదానం

లైటింగ్, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 15:  పరకాల పట్టణంలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్ అధికా…

By · · Updated

Share this article
సద్దుల బతుకమ్మ వేడుకలకు ముస్తాబవుతున్న పరకాల అంగడి మైదానం

లైటింగ్, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 15: 

పరకాల పట్టణంలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో పట్టణంలోని గొడ్ల అంగడి మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ పరిశీలించారు.

బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మైదానంలో చేపడుతున్న విద్యుత్ దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

పండుగ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, లైటింగ్ ఏర్పాట్లను సక్రమంగా పూర్తి చేయడంపై దృష్టి సారించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బండి శ్రీధర్, అల్లె దశరథంతో పాటు పోరండ్ల వేణు, గొడుగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: