పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 19:
పరకాల పట్టణంలో సద్దుల బతుకమ్మ పండుగ సందడి నెలకొన్న వేళ 13వ వార్డు ఎస్సీ కొత్తవాడలో మాత్రం మహిళలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు.
నెల రోజులుగా నల్లాల్లో నీటి సరఫరా లేకపోవడంతో బిందెలు పట్టుకుని బోర్ల చుట్టూ తిరుగుతున్నామని మహిళలు వాపోతున్నారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వార్డు వాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
పండుగ వేళలోనైనా నీటి సమస్యను పరిష్కరించి తాగునీరు అందించాలని 13వ వార్డు వాసులు కోరుతున్నారు.






