తెలంగాణ

సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి!   పరకాలలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం.. భద్రత, పారిశుద్ధ్యం, ప్రజా సౌకర్…

By · · Updated

Share this article
సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి!

 

పరకాలలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం.. భద్రత, పారిశుద్ధ్యం, ప్రజా సౌకర్యాలపై చర్చ

పరకాల తెలంగాణ గళం, అక్టోబర్ 16:

పరకాల పట్టణంలో సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) ఉత్సవాలను అంగరంగ వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పరకాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 

పండుగల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా చేపట్టాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల పెద్దలు, సంబంధిత అధికారులు పాల్గొని ఉత్సవాల నిర్వహణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పండుగల సందర్భంగా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఉత్సవ ప్రాంగణాల్లో పరిశుభ్రతను పాటించడం, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటం వంటి అంశాలపై చర్చించారు.

 

ప్రజలందరూ సమన్వయంతో వ్యవహరిస్తూ సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

ఈ అఖిలపక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, ఆర్డీఓ వెంకన్న, ఏసీపీ సతీష్ బాబు, పరకాల సీఐ ప్రవీణ్ కుమార్, కుంకుమేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సంపత్ శర్మ, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్ కుమార్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల పెద్దలు, పరకాల ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

Tags: