తెలంగాణ

రూ.500 బోనస్‌కు మూడ్రోజులే!

ఏడు రకాల సన్న రకాల వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌.. సెప్టెంబర్‌ 10లోగా పంట నమోదు తప్పనిసరి ఇల్లందు, సెప్టెంబర్‌ 8 (తెలంగాణ గళం): రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్న రకాల వరి ధాన్…

By · · Updated

Share this article
రూ.500 బోనస్‌కు మూడ్రోజులే!

ఏడు రకాల సన్న రకాల వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌.. సెప్టెంబర్‌ 10లోగా పంట నమోదు తప్పనిసరి

ఇల్లందు, సెప్టెంబర్‌ 8 (తెలంగాణ గళం): రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్న రకాల వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందించనుంది. తెలంగాణ సోనా (RNR-15048), సాంబా మసూరి (BPT-5204), కునారం సన్నాలు (KNM-1638), HMT సోనా, జై శ్రీరామ్‌, సిద్ధి (WGL-44), KNM-7715 రకాలకు ఈ బోనస్‌ వర్తిస్తుంది.

పంట నమోదు విధానం: సన్న రకం వరి సాగు చేసిన రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన సంబంధిత విత్తన డీలర్‌ను సంప్రదించి పంట నమోదు చేయించుకోవాలి. రైతు పేరు, ఆధార్‌ వివరాలు, మొబైల్‌ నంబర్‌, సాగు చేసిన సన్న వరి రకం, సాగు విస్తీర్ణం తదితర వివరాలను డీలర్‌కు అందించాలి. డీలర్‌ ద్వారా పంట వివరాలు నమోదు చేసిన అనంతరం, నమోదు ప్రక్రియ పూర్తయినట్లు రైతులు నిర్ధారించుకోవాలి. సెప్టెంబర్‌ 10 చివరి గడువు కావడంతో చివరి రోజు వరకు వేచి ఉండకుండా వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇల్లందు మండలంలో సుమారు 2,200 మంది రైతుల నుంచి దరఖాస్తులు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 600 దరఖాస్తులు మాత్రమే అందినట్లు ఏవో సతీష్‌ తెలిపారు. అర్హులైన రైతులందరూ గడువులోగా పంట నమోదు పూర్తి చేసుకుని రూ.500 బోనస్‌ ప్రయోజనం పొందాలని ఆయన కోరారు.