తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం న్యూరో సర్జన్ సజీవ దహనం!

తెలంగాణ గళం/హాసన్ పర్తి,(సెప్టెంబర్ 20)​ :   సూర్యాపేట-ఖమ్మం 365వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను తీవ్రంగా ఢ…

By · · Updated

Share this article
రోడ్డు ప్రమాదంలో ఖమ్మం న్యూరో సర్జన్ సజీవ దహనం!

తెలంగాణ గళం/హాసన్ పర్తి,(సెప్టెంబర్ 20)​ :

 

సూర్యాపేట-ఖమ్మం 365వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను తీవ్రంగా ఢీకొట్టడంతో, క్షణాల్లో మంటలు చెలరేగి ప్రసిద్ధ వైద్యుడు సజీవ దహనమయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో ప్రముఖ న్యూరో సర్జన్‌గా సేవలందిస్తున్న డాక్టర్ కాసకుర్తి జగదీష్ తన వోల్వో కారులో ప్రయాణిస్తుండగా, సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ​

మంటల్లో చిక్కుకుని దుర్మరణం:

కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు కారు డోర్లు లాక్ అయిపోవడంతో డాక్టర్ జగదీష్ లోపలే చిక్కుకుపోయారు. క్షణాల వ్యవధిలోనే మంటలు వాహనమంతటా వ్యాపించడంతో ఆయన బయటకు రాలేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ​స్థానికులు గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే, ఆలోపే కారు పూర్తిగా భస్మీపటలమైంది. సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ​

కేసు నమోదు – దర్యాప్తు:

కారులో లభించిన ఆధారాల ఆధారంగా మృతుడిని డాక్టర్ కాసకుర్తి జగదీష్‌గా పోలీసులు ధృవీకరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ప్రముఖ వైద్యుడు దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఖమ్మం, సూర్యాపేట ప్రాంతాల్లో తీవ్ర విషాదం అలముకుంది.