తెలంగాణ

రోడ్డు పక్కన దీనావస్థలో వృద్ధురాలు.అండగా నిలిచిన దామెర ఎస్సై

నిత్యావసర వస్తువులతో పాటు రూ.3 వేల ఆర్థిక సాయం.. వైద్య చికిత్సకూ సహకరిస్తానని హామీ దామెర, తెలంగాణ గళం, అక్టోబర్ 26: మానవత్వమే మహోన్నతమైన సేవ అని చాటుకున్నారు దామెర ఎస్సై ఈ. వీరభద్రరావు. విధి నిర్వహ…

By · · Updated

Share this article
రోడ్డు పక్కన దీనావస్థలో వృద్ధురాలు.అండగా నిలిచిన దామెర ఎస్సై

నిత్యావసర వస్తువులతో పాటు రూ.3 వేల ఆర్థిక సాయం.. వైద్య చికిత్సకూ సహకరిస్తానని హామీ

దామెర, తెలంగాణ గళం, అక్టోబర్ 26:

మానవత్వమే మహోన్నతమైన సేవ అని చాటుకున్నారు దామెర ఎస్సై ఈ. వీరభద్రరావు. విధి నిర్వహణలో భాగంగా రాత్రి సమయంలో సింగరాజుపల్లి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆయనకు రోడ్డు పక్కన పడుకుని ఉన్న ఓ వృద్ధురాలు కనిపించింది.

ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన ఎస్సై, మరుసటి రోజు ఉదయం వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆమె పరిస్థితిని, వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కొన్నేళ్లుగా రోడ్డు పక్కనే జీవనం సాగిస్తున్న వృద్ధురాలికి మానవతా దృక్పథంతో ఎస్సై అండగా నిలిచారు. 

ఆమెకు బెడ్‌షీట్లు, టవల్స్, పండ్లు, నిత్యావసర వస్తువులతో పాటు రూ.3,000 నగదును అందజేశారు. అంతేకాకుండా, వృద్ధురాలికి అవసరమైన వైద్య చికిత్స కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

పోలీసు విధులతో పాటు సామాజిక సేవలోనూ ముందడుగు!

రోడ్డు పక్కన దీనస్థితిలో జీవిస్తున్న వృద్ధురాలికి ఎస్సై అందించిన సహాయంపై గ్రామ మహిళలు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, నిరుపేదలు మరియు అభాగ్యుల పట్ల మానవత్వంతో స్పందించడం అభినందనీయమని కొనియాడారు.

పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, సమాజంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే సేవాభావం కూడా కలిగి ఉంటారని ఎస్సై వీరభద్రరావు తన చర్యతో చాటిచెప్పారు.

Tags: